Sunday, 7 August 2011

శ్రావణమాసం -కొరమేను ఫ్రై

మండే మార్నింగ్ లేచినదగ్గర నుండి ఎప్పుడెప్పుడొస్తుందో అని ఎదురు చూసే వీక్ ఎండ్ రానే వచ్చేసింది. వీకెండ్ అది చేయాలి ,ఇది చేయాలి ఇక్కడికెళ్ళాలి ,అక్కడికెళ్ళాలి ,అన్ని పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాలి అని చాలా చాలా ప్లాన్ చేసుకుంటాము వీక్ డేస్ లో .కాని వీకెండ్ వచ్చేసరికి అవి ఏవి కుదరవు,ఎందుకంటే సడన్ గా ఎవరో ఒకరు కాల్ చేస్తారు ,అన్ స్కెడ్యూల్ ప్రోగ్రామ్స్ వచ్చేస్తూ ఉంటాయి .అలా సాటర్ డే ఓవర్ .

ఇక సండే కి వస్తే మార్నింగ్ లేచిన దగ్గరనుండి క్లీనింగ్ అని, వాషింగ్ అని ఎన్నెన్నో పనులు .ఇన్ని పనులు చేస్తే ఎంత ఎనర్జీ పోతుందో చెప్పండీ .అందుకని మంచి మంచి నాన్ వెజ్ వంటలు స్పెషల్ గా చేసుకుని పుష్టిగా తిని ఆరామ్ గా పడుకుంటే ఎంత హేప్పీగా ఉంటుందో కదా !!!
ఇప్పుడు శ్రావణమాసం కదండీ ,నేను నావేజ్ తినను కాని నా ఫ్రెండ్స్ ఊరుకోరు కదా ,వండమని ఒకటే గోల (ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరిలో కొద్దో గొప్పో నాన్వెజ్ వండటం తెలిసింది నేనే కాబట్టి :-) ) ఏం చేస్తాం తప్పదుకదా వండాలి .
ఎలాగో నేను నాన్వెజ్ తినను కాబట్టి మొదటిసారి నా ఫ్రెండ్స మీద కొరమేను ఫ్రై ప్రయోగం చేసాను .అది ఎలాగో మీకు కూడా చెప్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.

కావలసిన పదార్ధంలు :-
కొరమేను -500 గ్రాములు(సన్నగా కట్ చేసినవి )
అల్లం వెల్లుల్లి ముద్దా - 1 టేబులు స్పూన్
కారం- 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
గరం మసాలా- 1 /2 టేబుల్ స్పూన్
నిమ్మకాయ - 1
పసుపు- చిటికెడు
ఆయిల్ - నాలుగు స్పూన్లు
కొత్తిమీర ,ఉల్లిపాయ ముక్కలు- డెకరేషన్కు తగ్గట్టు
తయారు చేసే పద్దతి :-
ముందుగా తాజా కొరమేను చేప ముక్కలను శుబ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి .తరువాత ఒక చిన్న గిన్నెలో కారం,పసుపు,ఉప్పు,మసాలా పొడి,అల్లంవెల్లుల్లి ముద్దా కొద్దిగా నూనె వేసి కలుపుకుని, ఒక్కొక్క చేపకు పట్టించి, సగం నిమ్మచేక్కను పిండి డీప్ ప్రీజర్ లో  ఒక పదినిమిషాలు ఉంచాలి .ఇలా చేయడం వాళ్ళ మసాలా ముక్కకు బాగా పడుతుంది.
తరువాత ఒక బాణాలి లో నూనె వేడి చేసి కాగాకా ఒక్కో ముక్కను విడివిడిగా చిన్న మంటపై వేపుకోవాలి.ఐదు నిమిషాల తరువాత మరొక వైపుకు తిప్పి మాడిపోకుండా వేపుకోవాలి .చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర ,నిమ్మరసం,మసాలా పొడి పైన జల్లి ప్లేట్లో వేసి కొత్తిమీరా ఉళ్లు ముక్కలతో అలంకరించాలి. అంతే ఘుమ ఘుమలాడే నోరూరించే కొరమేను ఫ్రై రెడీ.
ఏదో ప్రయోగం చేద్దాం అనుకున్నానుగానీ బ్లాగ్ కోసం ఫొటోస్ తీసేలోపే తినడం స్టార్ట్ చేసారు .ఫొటోస్ బాగున్నాయికదా,ఫొటోస్ మాత్రమె కాదండోయ్ టేస్ట్ కూడా అదిరిందట

Thursday, 4 August 2011

నా ONSITE అనుభవాలు (సింగపూర్ ) part-2



ఆ తరువాత కధ మామూలే , కాన్ఫెరెన్స్ రూం నుండి బయటకు రాగానే మా టీం దగ్గర ఇదంతా షేర్ చేయాలి కదా !!! అందుకని మా టి.ఎల్ నాకంటే ముందుగా పరుగులు తీసివచ్చి ఒక్కొక్కరిని పిలిచి మీకు కాన్వాకేషన్ ఉందా ??? అని అడగడం స్టార్ట్ చేసారు . అంతంటి తో వదలకుండా మైథిలి ఇంకా అప్లయ్ చేయలేదట చాలా గ్రేట్ కదా అని అన్నారు. చేసేదేమీ లేక కాం గా వచ్చి నా సీట్లో కూర్చున్నాను .

ఇదంతా బానే ఉందికాని ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళాలికదా ??మరి టిక్కెట్స్ సంగతి ఏంటి అని ఆలోచిస్తూ ,అసలు టిక్కెట్స్ దొరుకుతాయా లేదా? ఇక్కడ ట్రావెల్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు ఒక వేళ టిక్కెట్స్ దొరకక పొతే ఎలాగా? ఎలా వెళ్ళాలి? వెళ్ళక పొతే మళ్ళీ మా టి.ఎల్ నస పెడతాడు అని భయపడ్డాను కొంచెం సేపు. అయినా మనకు అండగా సలహాలు,సూచనలు ఇవ్వడానికి మన గూగుల్ తాతయ్య ఉన్నారు కదా" సో నో వర్రీ మైథిలి "అని నాకు నేను ధైర్యం చెప్పుకుని టిక్కెట్స్ అవి బుక్ చేసుకుని సాయంత్రం బయలుదేరాను .

ఫ్రెండ్స్ కి ముందే కాల్ చేసి చెప్పాను నేను హైదరాబాద్ వస్తున్నాను రేపు మార్నింగ్ అని . సడన్ గా ,అదీ వీక్ డేస్లో వస్తున్నా అని చెప్పేసరికి పాపం వాళ్ళు భయపడి ఏమైనా సీరియస్ మేటర్ ఆ అని అడిగారు .అదేం లేదు చిన్న పని అందుకని అని చెప్పాను .మొత్తానికి నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ లో మా ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్లాను .వాళ్ళని చూడగానే మా టి ఎల్ పై దాగి ఉన్న కోపం తిట్ల రూపం లో బయటకు వచ్చేసి ఎడాపెడా తిట్టేసి తరువాత నా ఆన్ సైట్ ఆపర్చునిటీ గురించి చెప్పాను .మా ఫ్రెండ్స్ ఎవ్వరికీ అప్పటివరకూ ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ లేదు .సో అందరిలో కొంచం గొప్పగా అనిపించింది .

ఆ తరువాత యూనివర్సిటీకి వెళ్లి కాన్వాకేషన్ అప్లయ్ చేసాను అది అంత ఈజీగా అవ్వలేదులెండి ,అది కూడా ఒక పెద్ద కధ.అప్లయ్ చేయడానికి ఏదో డి డి తీయాలి అన్నారు దగ్గరలో బ్యాంక్ కూడా లేదు ఏవో నానా తంటాలు పడి అప్లయ్ చేసాను .ఆ తర్వాత వెంటనే చెన్నై వెళ్ళిపోయాను . రాగానే మా టి.ఎల్ మొదటి ప్రశ్న కాన్వాకేషన్ అప్లయ్ చేసావా అని.చాలా గర్వంగా 2 డేస్ బ్యాక్ చేసేసాను అని చెప్పాను.ఆ తరువాత వన్ వీక్ లో అది రాగానే EP ప్రోసెస్ స్టార్ట్ చేసేసారు .అక్కడి నుండి అన్ని చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి.

బ్రేక్ లో మయూరితో కాఫీ త్రాగుతుంటే మా టి.ఎల్ వచ్చి మీకు అడ్మిన్ నుండి మెయిల్ వచ్చింది EP అప్లికేషన్ ఫాం పిలప్ చేయాలి త్వరగా రండి అని . ఆయనకీ ప్రతీది కంగారు ,ఏదీ ప్రశాంతంగా చేయనివ్వరు ఆయన చేయరు.ఇద్దరం కప్పులు అక్కడే పడేసి పరుగున వెళ్లాం.
 
(To be continued...)


Tuesday, 2 August 2011

నా ONSITE అనుభవాలు (సింగపూర్ )

అదే కంగారు అదే హడావుడి పరుగుపరుగున ఆఫీస్ కి బయలుదేరాను .వస్తూనే అమ్మో! మళ్ళీ లేట్ గానే వెళుతున్నాను ,ఆ టి.ఎల్ కంట పడ్డానో అంతే సంగతులు అని అనుకుంటూ కార్డ్ స్వైప్ చేయగానే... ఏవో చిన్న చిన్న అరుపులు,కేకలు .."మైథిలి ఇంకా రాలేదా? ఈ అమ్మాయి ఎప్పుడూ ఇంతే టైం కి రాదు అని." అది వినగానే టెన్షన్ స్టార్ట్ ( పాపం మైథిలి ఏం చేస్తుంది చెప్పండి.మార్నింగ్ లేవాలి,కష్టపడి రెడీ అవ్వాలి ,హాస్టల్ లో చేసిన ఒక చెత్త బ్రేక్ ఫాస్ట్ తినాలి అప్పుడు ఆటో పట్టుకుని వాడితో బేరాలు ఆడి  ఆఫీస్కి రావాలి ఎన్ని కష్టాలు చెప్పండి ప్చ్ ..ప్చ్ ..ప్చ్..)

 అమ్మో మళ్ళీ ఏంటో ఇష్యూస్ వచ్చాయి అనుకుంటూ ఉండగానే ఎదురుగా మా టి.ఎల్ ప్రత్యక్షం . "ఏంటమ్మా! టైం అయ్యిందా ? ఇప్పుడే లేచావా నిద్ర నుండి "అని ప్రశ్నల వర్షం .ఆన్సర్ చెప్పేలోగానే ఎప్పటిలాగానే మనకు ఆ చాన్స్ ఇవ్వరుకదా!!!." కాన్ఫెరెన్స్ రూం కి పదా మేనేజర్ కాల్ చేసారు సింగపూర్ నుండి.నీకోసం వెయిటింగ్ ..ఏదో ఇంపార్టెంట్ విషయం డిస్కస్  చేయాలట" అనగానే కంగారుగా డెస్క్ దగ్గరకు వెళ్లి బ్యాగ్ అక్కడ పడేసి కొలీగ్స్ ని అడిగాను" ఏమిటి? ఏదైనా సీరియస్ ఇష్యూనా?? అని..బట్ అందరూ  ఎవరికి వాళ్ళు" ఐ డోంట్ నో "అని చెప్పేసరికి మరికాస్త టెన్స్ పెరిగిపోయింది. పక్కనే ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కం కొలీగ్ ని వాటర్ అడిగి గడగడా తాగేసి పరుగు పరుగున ఒక నోట్బుక్ తీసుకుని కాన్ఫెరెన్స్ రూమ్ కి  వెళ్లాను ..

అక్కడ ఆల్రేడి మా టి.ఎల్ వీడియో కాన్ఫెరెన్స్ లో ఉన్నారు మా మేనేజర్ తో ..నన్ను చూసి మా టి.ఎల్' మైథిలి వచ్చింది సర్ 'అని కెమెరా  నావైపు తిప్పారు.  నేను విష్ చేయగానే ఆయన" ఏమ్మా ఎలా ఉన్నావ్? చెన్నై కి కొత్తకదా అకామిడేషన్ ,ఫుడ్  అదీ ఎలా ఉంది? ముఖ్యంగా బెంగళూర్ నుండి వచ్చావ్ కదా చెన్నై వెదర్ కి  అడ్జస్ట్ అవుతున్నావా "అని అడగ గానే   అబ్బా ఎంత మంచి మనిషి ఒక రీసోర్స్ మీద ఎంత కన్సర్న్ చూపిస్తున్నారు అని (మా సాడిష్ట్ టి.ఎల్ వైపు ఒక చూపు చూసి) చాలా హేపీగా అనిపించి ఉబ్బితబ్బిబ్బు అయిపోయి అడిగిన అన్నింటికీ  ఒక బ్రాడ్ స్మైల్ తో అన్నింటికీ ఫటాఫట్ అని  సమాధానాలు చెప్పేసాను .

ఈలోపు మా టి.ఎల్ కలగజేసుకుని ఇంతకూ అసలు విషయం ఏమిటంటే అని స్టార్ట్ చేసారు .. అప్పుడప్పుడే కూల్ అవుతున్న నాకు మళ్లీ టెన్షన్ ...  .అప్పుడు మా మేనేజర్ .. ఓకే ఫైన్ అసలు విషయం ఏమిటంటే అని ఆపగానే...అబ్బా  ఎవరో ఒకరు చెప్పచ్చు గా ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ  సడన్ గా మాటల రూపంలో బయటకు వచ్చేసింది . కూల్ మైథిలి నత్తింగ్ టూ వర్రీ  actually ఈ ప్రాజెక్ట్ కి క్లైంట్ ప్లేస్లో(సింగపూర్) టూ రీసోర్స్ రిక్వైర్మెంట్  ఉంది ,దానికి నిన్ను ,మయూరిని సెలెక్ట్ చేసాము ..అనగానే ఒక్క క్షణం ఇది కల నిజమా అని అర్ధం కాక ఎం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా ,ముఖం లో  రకరకాల ఎక్స్ప్రెషన్ పెట్టి ఆ షాక్లో నుండి బయటకు రాకమునుపే  మా టి.ఎల్  మధ్యలోనే ఇంతకీ తమరికి కాన్వాకేషన్ ఉందా అని అడిగారు .

అబ్బా,మళ్ళీ ట్విస్ట్ పెట్టాడురా బాబు అని టి.ఎల్ ని మనసులో తిట్టుకుంటూ  పైకి అమాయకంగా అయ్యో లేదండి !! బి.టెక్ తరువాత తీసుకుందాం అనుకున్నాను కాని కుదరలేదు అనేలోగా ఎప్పుడు చాన్స్ దొరుకుతుందా ఎప్పుడెప్పుడు తిట్టేద్దామా అని ఎదురు చూస్తున్న ఆయనకు ఇదే మంచి చాన్స్ కదా అని మొదలు పెట్టేసారు .అసలు ఇన్ని రోజుల నుండి కాన్వాకేషన్ లేదా!!!! ఏం చేస్తున్నావ్ ? ఎందుకు అప్లయ్ చేయలేదు ఇప్పుడు ఎలాగా అని నాలుగు తిట్లు తిట్టేసి మేనేజర్ కి కంప్లైంట్ ...

"చూడండి సర్ ఈ అమ్మాయి ...కాన్వాకేషన్ లేదంట ఎప్పుడూ ఇంతే "అని చెప్పేశారు. దానికి  ఆయన " ఎందుకంత కంగారు ఇప్పుడు వెళ్లి యూనివెర్సిటీలో అప్లయ్ చేయచ్చుకదా అని అన్నారు కూల్ గా . హమ్మయ్యా!! అని ఊపిరి పీల్చుకుని  " ష్యూర్ ,నేను వీకెండ్ హైదరాబాద్ వెళ్లి అప్ప్లయ్  చేస్తాను " అని చెప్పాను .దానికి ఇమ్మడియట్ గా  మా టి.ఎల్ నుండి సమాధానం .."వీకెండ్ అంటే చాలా లేట్ అవుతుంది ఈ రోజు ఈవినింగ్ బయలుదేరి వెళ్లి రేపు అప్లయ్ చేసి రా "అన్నారు కోపంగా .దానికి నేను సరే అన్నాను దీనంగా (కాని మనసులో కోపం ,కసి వీడేప్పుడు ఇంతే ..ఏదో ఒక వంకతో తిట్టడం తప్పా సరిగ్గా ఉండదు కదా అని..కాని ఏం చేస్తాం చెప్పండి మీ తో అయితే చెప్పగలను గాని మా టి.ఎల్ తో అనలేను కదా )
(To be continued.....)