Sunday 7 August 2011

శ్రావణమాసం -కొరమేను ఫ్రై

మండే మార్నింగ్ లేచినదగ్గర నుండి ఎప్పుడెప్పుడొస్తుందో అని ఎదురు చూసే వీక్ ఎండ్ రానే వచ్చేసింది. వీకెండ్ అది చేయాలి ,ఇది చేయాలి ఇక్కడికెళ్ళాలి ,అక్కడికెళ్ళాలి ,అన్ని పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాలి అని చాలా చాలా ప్లాన్ చేసుకుంటాము వీక్ డేస్ లో .కాని వీకెండ్ వచ్చేసరికి అవి ఏవి కుదరవు,ఎందుకంటే సడన్ గా ఎవరో ఒకరు కాల్ చేస్తారు ,అన్ స్కెడ్యూల్ ప్రోగ్రామ్స్ వచ్చేస్తూ ఉంటాయి .అలా సాటర్ డే ఓవర్ .

ఇక సండే కి వస్తే మార్నింగ్ లేచిన దగ్గరనుండి క్లీనింగ్ అని, వాషింగ్ అని ఎన్నెన్నో పనులు .ఇన్ని పనులు చేస్తే ఎంత ఎనర్జీ పోతుందో చెప్పండీ .అందుకని మంచి మంచి నాన్ వెజ్ వంటలు స్పెషల్ గా చేసుకుని పుష్టిగా తిని ఆరామ్ గా పడుకుంటే ఎంత హేప్పీగా ఉంటుందో కదా !!!
ఇప్పుడు శ్రావణమాసం కదండీ ,నేను నావేజ్ తినను కాని నా ఫ్రెండ్స్ ఊరుకోరు కదా ,వండమని ఒకటే గోల (ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరిలో కొద్దో గొప్పో నాన్వెజ్ వండటం తెలిసింది నేనే కాబట్టి :-) ) ఏం చేస్తాం తప్పదుకదా వండాలి .
ఎలాగో నేను నాన్వెజ్ తినను కాబట్టి మొదటిసారి నా ఫ్రెండ్స మీద కొరమేను ఫ్రై ప్రయోగం చేసాను .అది ఎలాగో మీకు కూడా చెప్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.

కావలసిన పదార్ధంలు :-
కొరమేను -500 గ్రాములు(సన్నగా కట్ చేసినవి )
అల్లం వెల్లుల్లి ముద్దా - 1 టేబులు స్పూన్
కారం- 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
గరం మసాలా- 1 /2 టేబుల్ స్పూన్
నిమ్మకాయ - 1
పసుపు- చిటికెడు
ఆయిల్ - నాలుగు స్పూన్లు
కొత్తిమీర ,ఉల్లిపాయ ముక్కలు- డెకరేషన్కు తగ్గట్టు
తయారు చేసే పద్దతి :-
ముందుగా తాజా కొరమేను చేప ముక్కలను శుబ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి .తరువాత ఒక చిన్న గిన్నెలో కారం,పసుపు,ఉప్పు,మసాలా పొడి,అల్లంవెల్లుల్లి ముద్దా కొద్దిగా నూనె వేసి కలుపుకుని, ఒక్కొక్క చేపకు పట్టించి, సగం నిమ్మచేక్కను పిండి డీప్ ప్రీజర్ లో  ఒక పదినిమిషాలు ఉంచాలి .ఇలా చేయడం వాళ్ళ మసాలా ముక్కకు బాగా పడుతుంది.
తరువాత ఒక బాణాలి లో నూనె వేడి చేసి కాగాకా ఒక్కో ముక్కను విడివిడిగా చిన్న మంటపై వేపుకోవాలి.ఐదు నిమిషాల తరువాత మరొక వైపుకు తిప్పి మాడిపోకుండా వేపుకోవాలి .చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర ,నిమ్మరసం,మసాలా పొడి పైన జల్లి ప్లేట్లో వేసి కొత్తిమీరా ఉళ్లు ముక్కలతో అలంకరించాలి. అంతే ఘుమ ఘుమలాడే నోరూరించే కొరమేను ఫ్రై రెడీ.
ఏదో ప్రయోగం చేద్దాం అనుకున్నానుగానీ బ్లాగ్ కోసం ఫొటోస్ తీసేలోపే తినడం స్టార్ట్ చేసారు .ఫొటోస్ బాగున్నాయికదా,ఫొటోస్ మాత్రమె కాదండోయ్ టేస్ట్ కూడా అదిరిందట

4 comments:

Bhuvan said...

can u tell me "దీప ఫ్రీజార్లో" means?
i too like koramenu. photo looks yammy :D

Sriharsha said...

Wowwwwwwwwwwww

Anonymous said...

కొరమీను ఫ్రై ఏ హోటెల్ నుండీ తెప్పించరూ? పోటో గూగుల్ లోదే కదా?

Praveen Sarma said...

ఆడవాళ్ల పరిస్థితి ఇంకా మారలేదూ ఇంకా దౌర్జన్యానికి గురి అవుతుందీ అని చెప్పడానికి ఈ పొస్టే ఉదాహరణ. ఉద్యోగాలు చేసే ఆడవారు సైతం ఇంకా పాతకాలపు మూఢ నమ్మకాలయిన శ్రావణమాసాలు చేస్తూ ఇంట్లో వంటలు చేస్తూ అణగదొక్కబడుతున్నారు. ఉద్యోగాలు చేసే మగవాళ్ళు వంటలు చేస్తారా? ఆడవాళ్ళకో నీతీ, మగాళ్ళకో నీతీనా?