అదే కంగారు అదే హడావుడి పరుగుపరుగున ఆఫీస్ కి బయలుదేరాను .వస్తూనే అమ్మో! మళ్ళీ లేట్ గానే వెళుతున్నాను ,ఆ టి.ఎల్ కంట పడ్డానో అంతే సంగతులు అని అనుకుంటూ కార్డ్ స్వైప్ చేయగానే... ఏవో చిన్న చిన్న అరుపులు,కేకలు .."మైథిలి ఇంకా రాలేదా? ఈ అమ్మాయి ఎప్పుడూ ఇంతే టైం కి రాదు అని." అది వినగానే టెన్షన్ స్టార్ట్ ( పాపం మైథిలి ఏం చేస్తుంది చెప్పండి.మార్నింగ్ లేవాలి,కష్టపడి రెడీ అవ్వాలి ,హాస్టల్ లో చేసిన ఒక చెత్త బ్రేక్ ఫాస్ట్ తినాలి అప్పుడు ఆటో పట్టుకుని వాడితో బేరాలు ఆడి ఆఫీస్‌కి రావాలి ఎన్ని కష్టాలు చెప్పండి ప్చ్ ..ప్చ్ ..ప్చ్..)
అమ్మో మళ్ళీ ఏంటో ఇష్యూస్ వచ్చాయి అనుకుంటూ ఉండగానే ఎదురుగా మా టి.ఎల్ ప్రత్యక్షం . "ఏంటమ్మా! టైం అయ్యిందా ? ఇప్పుడే లేచావా నిద్ర నుండి "అని ప్రశ్నల వర్షం .ఆన్సర్ చెప్పేలోగానే ఎప్పటిలాగానే మనకు ఆ చాన్స్ ఇవ్వరుకదా!!!." కాన్ఫెరెన్స్ రూం కి పదా మేనేజర్ కాల్ చేసారు సింగపూర్ నుండి.నీకోసం వెయిటింగ్ ..ఏదో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలట" అనగానే కంగారుగా డెస్క్ దగ్గరకు వెళ్లి బ్యాగ్ అక్కడ పడేసి కొలీగ్స్ ని అడిగాను" ఏమిటి? ఏదైనా సీరియస్ ఇష్యూనా?? అని..బట్ అందరూ ఎవరికి వాళ్ళు" ఐ డోంట్ నో "అని చెప్పేసరికి మరికాస్త టెన్స్ పెరిగిపోయింది. పక్కనే ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కం కొలీగ్ ని వాటర్ అడిగి గడగడా తాగేసి పరుగు పరుగున ఒక నోట్‌బుక్ తీసుకుని కాన్ఫెరెన్స్ రూమ్ కి వెళ్లాను ..
అక్కడ ఆల్రేడి మా టి.ఎల్ వీడియో కాన్ఫెరెన్స్ లో ఉన్నారు మా మేనేజర్ తో ..నన్ను చూసి మా టి.ఎల్' మైథిలి వచ్చింది సర్ 'అని కెమెరా నావైపు తిప్పారు. నేను విష్ చేయగానే ఆయన" ఏమ్మా ఎలా ఉన్నావ్? చెన్నై కి కొత్తకదా అకామిడేషన్ ,ఫుడ్ అదీ ఎలా ఉంది? ముఖ్యంగా బెంగళూర్ నుండి వచ్చావ్ కదా చెన్నై వెదర్ కి అడ్జస్ట్ అవుతున్నావా "అని అడగ గానే అబ్బా ఎంత మంచి మనిషి ఒక రీసోర్స్ మీద ఎంత కన్సర్న్ చూపిస్తున్నారు అని (మా సాడిష్ట్ టి.ఎల్ వైపు ఒక చూపు చూసి) చాలా హేపీగా అనిపించి ఉబ్బితబ్బిబ్బు అయిపోయి అడిగిన అన్నింటికీ ఒక బ్రాడ్ స్మైల్ తో అన్నింటికీ ఫటాఫట్ అని సమాధానాలు చెప్పేసాను .
ఈలోపు మా టి.ఎల్ కలగజేసుకుని ఇంతకూ అసలు విషయం ఏమిటంటే అని స్టార్ట్ చేసారు .. అప్పుడప్పుడే కూల్ అవుతున్న నాకు మళ్లీ టెన్షన్ ... .అప్పుడు మా మేనేజర్ .. ఓకే ఫైన్ అసలు విషయం ఏమిటంటే అని ఆపగానే...అబ్బా ఎవరో ఒకరు చెప్పచ్చు గా ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ సడన్ గా మాటల రూపంలో బయటకు వచ్చేసింది . కూల్ మైథిలి నత్తింగ్ టూ వర్రీ actually ఈ ప్రాజెక్ట్ కి క్లైంట్ ప్లేస్‌లో(సింగపూర్) టూ రీసోర్స్ రిక్వైర్మెంట్ ఉంది ,దానికి నిన్ను ,మయూరిని సెలెక్ట్ చేసాము ..అనగానే ఒక్క క్షణం ఇది కల నిజమా అని అర్ధం కాక ఎం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా ,ముఖం లో రకరకాల ఎక్స్ప్రెషన్ పెట్టి ఆ షాక్‌లో నుండి బయటకు రాకమునుపే మా టి.ఎల్ మధ్యలోనే ఇంతకీ తమరికి కాన్వాకేషన్ ఉందా అని అడిగారు .
అబ్బా,మళ్ళీ ట్విస్ట్ పెట్టాడురా బాబు అని టి.ఎల్ ని మనసులో తిట్టుకుంటూ పైకి అమాయకంగా అయ్యో లేదండి !! బి.టెక్ తరువాత తీసుకుందాం అనుకున్నాను కాని కుదరలేదు అనేలోగా ఎప్పుడు చాన్స్ దొరుకుతుందా ఎప్పుడెప్పుడు తిట్టేద్దామా అని ఎదురు చూస్తున్న ఆయనకు ఇదే మంచి చాన్స్ కదా అని మొదలు పెట్టేసారు .అసలు ఇన్ని రోజుల నుండి కాన్వాకేషన్ లేదా!!!! ఏం చేస్తున్నావ్ ? ఎందుకు అప్లయ్ చేయలేదు ఇప్పుడు ఎలాగా అని నాలుగు తిట్లు తిట్టేసి మేనేజర్ కి కంప్లైంట్ ...
"చూడండి సర్ ఈ అమ్మాయి ...కాన్వాకేషన్ లేదంట ఎప్పుడూ ఇంతే "అని చెప్పేశారు. దానికి ఆయన " ఎందుకంత కంగారు ఇప్పుడు వెళ్లి యూనివెర్సిటీలో అప్లయ్ చేయచ్చుకదా అని అన్నారు కూల్ గా . హమ్మయ్యా!! అని ఊపిరి పీల్చుకుని " ష్యూర్ ,నేను వీకెండ్ హైదరాబాద్ వెళ్లి అప్ప్లయ్ చేస్తాను " అని చెప్పాను .దానికి ఇమ్మడియట్ గా మా టి.ఎల్ నుండి సమాధానం .."వీకెండ్ అంటే చాలా లేట్ అవుతుంది ఈ రోజు ఈవినింగ్ బయలుదేరి వెళ్లి రేపు అప్లయ్ చేసి రా "అన్నారు కోపంగా .దానికి నేను సరే అన్నాను దీనంగా (కాని మనసులో కోపం ,కసి వీడేప్పుడు ఇంతే ..ఏదో ఒక వంకతో తిట్టడం తప్పా సరిగ్గా ఉండదు కదా అని..కాని ఏం చేస్తాం చెప్పండి మీ తో అయితే చెప్పగలను గాని మా టి.ఎల్ తో అనలేను కదా )
(To be continued.....)
(To be continued.....)
14 comments:
Nice experience. Your narration is too cute.
Nice...waiting for the next part..
Nice Template...
Krishna
naa first onsite kooda Singapore aey...
T.Ls antene alaa untaaru
aemi cheyyalem
Client Place ela unnaa... Singapore lo u will enjoy a lot.... thats 4 sure....
How long is ur trip gonna be..?
Waiting for next part mythili
హమ్మయ్యా.. మీ పోస్ట్ చూశాకా నాకు చాలా కడుపులోకి కూల్ డ్రింక్ వెళ్ళినంత ఆనందమేసిందీ. టీ.ఎల్ ని తిట్టేవాళ్లందరూ నా ఫ్రెండ్స్ లాగా ఫీలయిపోతుంటానండీ.
మీ టీఎల్ సగం పిచ్చోడయితే మా టీఎల్ పూర్తి పిచ్చోడు(దరిద్రుడు). మీరు మేనేజర్ ని దేవుడంటున్నారు గానీ వెనకాల నుండీ నడిపించేదంతా ఆళ్ళే. పైకి మాత్రం మనదగ్గర ఊఊఊ కటింగ్లిచ్చేస్తారూ. టీ.ఎల్ చేత కడుపులో గుద్దించీ, వాళ్ళు కన్నీళ్ళు తుడుస్తారు. హ్మ్మ్... ఇంత మంచి విషయమున్న పోస్ట్ అంత చిన్నది గా రాసారేమిటండీ? ఐ హర్ట్ద్...;(
హాయ్ మైథిలి, మీ పోస్ట్ మీ పేరు లానే చాల సూపర్గ వుంది. నైస్ narration. మీరు రాసిన సంగతులు చూస్తుంటే నాకు కూడా నా ఫస్ట్ ఎస్సైన్మేంట్ గుర్తుకు వచ్చింది. ఈ మేనేజర్లు ఎప్పుడూ ఇంతే. నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడు రాస్తున్నారు.
Thankz sriharsha.
హాయ్ కృష్ణ గారు!!! నెక్స్ట్ పార్ట్ త్వరలోనే రాస్తానండి.
హాయ్ Maddy !!! ఓహ్ ... మీరు కూడా ఫస్ట్ సింగపూర్ కే వచ్చారా? అవునండి మీరు చెప్పింది నిజమే క్లైంట్ ప్లేస్ లో చాల వర్క్ ఉంటున్న సింగపూర్ మాత్రం చాల సూపర్ గ ఉంది.
హాయ్ Raj !!! మీ కామెంట్ చూసి చాల రోజుల తర్వాత ఫుల్ గ నవ్వుకున్నాను...పోస్ట్ మంచి విషయం ఉన్నదే కాని రాయడం కొత్త కదా అందుకని ఎక్కువ రాయలేక పోయాను....నెక్స్ట్ టైం తప్పకుండ ట్రై చేస్తాను.
thankz anonymous for ur comment
బాగా రాస్తున్నారు కానీ ఒక సూచన అండీ. మన మీద మనం జాలి కురిపించుకునే వాక్యాలు,మనము అమాయుకలము అని చెప్పడానికి వాడే వాక్యాలు (Eg.పాపం మైథిలి ఏం చేస్తుంది....) పదాల ప్రాస కోసం వాడే ఉపమానాలు చెయ్యకుండా రాయండి. ఈ మధ్య బ్లాగుల్లో ఇలాంటి వాటికే హాస్య బ్లాగులుగా పట్టం కడుతున్నారూనుకోండి.
అలా రాస్తే ఇన్స్టంట్ హిట్టయ్యి మీరేమి రాసినా ఆ ఉపమానాలకి ఆహా, ఓహో అనే ఫాలోవర్స్ తయారవుతారు కానీ మీ రాతల నాణ్యత కొరవడుతుందని గుర్తించండి.
హాయ్ అజ్ఞాత గారు!!!
నాకు ఈ మద్యనే బ్లాగ్స్ గురించి తెలిసింది... ఇంట్రెస్టింగ్ గ అనిపించి బ్లాగ్ స్టార్ట్ చేశాను... టైం పాస్ కోసం మాత్రమే...కాని మీ సలహా గుర్తు పెట్టుకుంటాను...
Thankz 4 ur suggestion...
హాయ్ మగధీర గారు!!! thankz 4 ur comment... నెక్స్ట్ పార్ట్ కూడ రాసాను చూడండి....
Post a Comment